'ఆడదే ఆధారం' చిత్ర దర్శకుడు విసు కన్నుమూత

  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విసు
  • చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచిన దర్శకుడు
  • నటనలోనూ రాణించిన విసు
తెలుగులో 'సంసారం ఒక చదరంగం', 'ఆడదే ఆధారం' వంటి కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ప్రముఖ దర్శకుడు విసు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య ఉమ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా విసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాథన్. 1945 జూలై 1న తమిళనాడులో జన్మించిన విసు దర్శకదిగ్గజం బాలచందర్ వద్ద సహాయకుడిగా కెరీర్ ఆరంభించాడు. దర్శకుడిగానే కాదు నటుడిగానూ ఆయన తనదైన ముద్రవేశారు. రచయితగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటించిన విసు రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు.


More Telugu News