ఏపీలో తీవ్రత తక్కువగా ఉన్నా లాక్ డౌన్ విధిస్తున్నాం: సీఎం జగన్
- ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటన
- ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోతుందన్న సీఎం జగన్
- ఇతర రాష్ట్రాల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడి
ఇవాళ కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో భయానక వాతావరణం నెలకొని ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో పరిస్థితి అదుపులో ఉన్నా, ఇతర రాష్ట్రాల పరిస్థితులు, దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధించక తప్పడంలేదని పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చని సూచించారు. అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాంలు, ఆఫీసులు ముఖ్యమైన సిబ్బందితోనే నడపాలని తెలిపారు.