కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టిన చంద్రబాబు

  • నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
  • సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హోరెత్తించిన దేశ ప్రజలు
  • మోదీ పిలుపునకు స్పందించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కరోనాపై పోరాటంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులకు సంఘీభావంగా చప్పట్టు కొట్టారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు దేశప్రజలందరూ చప్పట్లో అభినందించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు చంద్రబాబు కూడా స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి తన నివాసానికే పరిమితమైన ఆయన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు తన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్ లతో బాల్కనీలోకి వచ్చి కరోనా వీరులకు మద్దతుగా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, సాయుధ బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బందిని అభినందించే క్రమంలో ఈ చప్పట్లు కొట్టడం అనేది చిన్న అంశమని పేర్కొన్నారు. దేశం కోసం వారు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు.


More Telugu News