విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా వస్తూనే ఉన్నారు... అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం

  • జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వచ్చిందన్న కేంద్ర ఆరోగ్యశాఖ
  • కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యం అంటూ ఉద్ఘాటన
  • 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని కోరినట్టు వెల్లడి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూపై కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, ప్రజలందరూ ముందుకొచ్చారని అగర్వాల్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యం అని ఉద్ఘాటించారు. ఈ నెల 31 వరకు సబర్బన్, మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నామని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కోరామని చెప్పారు.

విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా మనదేశానికి వస్తున్నారని, అందువల్ల కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లను మొదట ఐసోలేషన్ కు తరలిస్తున్నామని, అందరికీ వైద్య పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచుతున్నామని చెప్పారు. అత్యవసర రవాణా సేవలే అందించాలని రాష్ట్రాలను కోరామని వెల్లడించారు.


More Telugu News