ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ దిశగా ఏపీ, తెలంగాణ...?
- అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు
- జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో లాక్ డౌన్ ప్రకటిస్తున్న రాష్ట్రాలు
- అదే బాటలో నడవనున్న తెలుగు రాష్ట్రాలు?
జనతా కర్ఫ్యూ స్ఫూర్తిగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. మరికాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వేర్వేరు మీడియా సమావేశాల్లో ఈ విషయం ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ విధిస్తే అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్ని కీలక సర్వీసులు తప్ప మిగతావన్నీ నిలిచిపోతాయి. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది.