ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా రైళ్లు బంద్
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- ఒక్కరోజే రెండు మరణాలు
- ప్రయాణికుల రైళ్లు నిలిపివేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం
దేశంలో కరోనా ఉద్ధృతి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు ప్రయాణికుల రైళ్లు నిలిపివేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 324కి పెరగడం, ఒక్కరోజే రెండు మరణాలు సంభవించిడం రైల్వే శాఖను ప్రభావితం చేశాయి. వాస్తవానికి జనతా కర్ఫ్యూ సందర్భంగా ఒక్కరోజు పాటు రైళ్లన్నీ నిలిపివేశారు.
అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి మరింతగా సహకరించాలన్న ఉద్దేశంతో రైళ్ల రద్దు నిర్ణయాన్ని రైల్వే శాఖ ఈ నెల 31 అర్ధరాత్రి వరకు పొడిగించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లు గమ్యస్థానం చేరేందుకు అనుమతించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.