ఇంట్లో కుటుంబ సభ్యులతో సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు
- జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉన్నాను
- ఏమీ కాదన్న నిర్లక్ష్య ధోరణి వద్దు
- నిర్లక్ష్య ధోరణి వల్ల చైనా, ఇటలీ వణికిపోతున్నాయి
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సెల్ఫీ వీడియో తీసుకుని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నమస్తే.. ముఖ్యమంత్రిగారు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉన్నాను. స్వచ్ఛందంగా ప్రజలు పాటిస్తోన్న ఈ కర్ఫ్యూ.. మిలటరీ, పోలీసులను పెట్టి జరిపే కర్ఫ్యూ కన్నా బాగా కొనసాగుతోంది. దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు' అని చెప్పారు.
'ఏమీ కాదన్న నిర్లక్ష్య ధోరణి వద్దు. నిర్లక్ష్య ధోరణి వల్ల చైనా, ఇటలీ వంటి దేశాలు కరోనాతో ఎలా వణికి పోతున్నాయో తెలుసుకున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం. మన కుటుంబం, రాష్ట్రం, దేశాన్ని రక్షించుకుందాం' అని హరీశ్ రావు చెప్పారు.