హైదరాబాద్లో రోడ్లపైకి వచ్చిన కొందరు వాహనదారులు.. వెనక్కి పంపిన సీపీ సజ్జనార్
- హైదరాబాద్లోని సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద ఘటన
- వాహనదారులను ఆపిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
- బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్న
తెలంగాణ ప్రజలంతా 'జనతా కర్ఫ్యూ' పాటిస్తోంటే కొందరు మాత్రం రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని పోలీసులు వెనక్కి పంపిచేస్తున్నారు. హైదరాబాద్లోని సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వారి వివరాలు తెలుసుకున్నారు. వారంతా బయటకు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. వారిని అక్కడి నుంచి తిరిగి పంపించారు.
దేశంలో పాటిస్తున్నది కర్ఫ్యూ కాదని 'కేర్ ఫర్ యూ' అని సజ్జనార్ చెప్పారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో 6,000 మంది పోలీసులు పనిచేస్తున్నారు.
కాగా, జనతా కర్ఫ్యూలో ఎవరూ పాల్గొనకూడదంటూ సంగారెడ్డి 34వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ సమీ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ రోడ్లపైకి రావాలన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు.