ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం

  • నిత్యావసరాలు, కూరగాయలు, మెడికల్‌ షాపులు తప్ప అన్నీ బంద్‌
  • సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ఆదేశాలు
  • కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్ణయం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. నిత్యావసరాలు, కూరగాయలు, మెడికల్‌ షాపులు తప్ప మిగిలినవన్నీ మూసివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో మొత్తం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు కూడా తిరగవు. ఇప్పటికే రాజస్థాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్‌ చేశారు.


More Telugu News