ముఖ్యంగా వారు ఇళ్లు వదిలి బయటకు రావద్దు: హీరో నాగార్జున

  • ప్రియమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా విన్నపం
  • మీరెవ్వరూ ఇళ్లు వదిలి బయటకు రాకండి 
  • ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు రావద్దు
  • సురక్షితంగా ఉండండి 
'మీరు క్షేమంగా ఉండండి.. మీ కుటుంబాన్ని, సమాజాన్ని క్షేమంగా ఉంచండి' అంటూ ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సినీనటుడు నాగార్జునతో ఓ సందేశం ఇప్పించింది.

'ప్రియమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా విన్నపం. మీరెవ్వరూ ఇళ్లు వదిలి బయటకు రాకండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రండి. ఈ దృఢ సంకల్పంతోనే కరోనాను అరికట్టవచ్చు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు ఇళ్లు వదిలి బయటకు రాకండి.. సురక్షితంగా ఉండండి' అని నాగార్జున అందులో కోరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడదామని నాగార్జున తన ట్విట్టర్‌ ఖాతాలోనూ పేర్కొన్నారు. 


More Telugu News