హైదరాబాద్‌లో బస్టాండులు అన్నీ ఖాళీ.. బస్టాపుల్లో క్రికెట్ ఆడుతున్న యువకులు
- బోసిపోయిన రోడ్లు, బస్టాండులు
- ఎంజీబీఎస్ బస్టాపులో క్రికెట్
- యువకులను పంపించేసిన పోలీసులు
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఖాళీగా కనపడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎల్లప్పుడు రద్దీగా కనపడే బస్టాండులన్నీ ఈ రోజు బోసిపోయి కనపడుతున్నాయి. దీంతో బస్టాండుల్లో కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండులోకి స్థానిక యువకులు వచ్చి కాసేపు క్రికెట్ ఆడారు. అయితే, అక్కడికి మీడియా రావడాన్ని గమనించిన పోలీసులు.. క్రికెట్ ఆడుతోన్న యువకులను అక్కడి నుంచి పంపించేశారు. తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో అన్ని జిల్లాల్లోని ప్రధాన బస్టాండుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.