ఇటలీ నుంచి భారత్‌ చేరుకున్న 263 మంది భారతీయులు

  • ఢిల్లీ విమానాశ్రయంలో పరీక్షలు
  • అక్కడి ఉంచి క్వారంటైన్‌ కేంద్రానికి
  • చాలా రోజులుగా రోమ్‌లోనే ఇబ్బందులు
ఇటలీ రాజధాని రోమ్‌ నుంచి 263 మంది భారతీయులు ఈ రోజు ఉదయం 9.15 గంటలకు భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, అక్కడి నుంచి ఢిల్లీలోని ఐటీబీపీ చావ్లా క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు.

భారత్‌ చేరుకున్న వారిలో తెలుగు వారు కూడా చాలా మంది ఉన్నారు. వారంతా రోజుల తరబడి రోమ్‌ విమానాశ్రయంలో పడిగాపులు పడ్డారు. భారత్‌ రావడానికి వారివద్ద టిక్కెట్లు ఉన్నప్పటికీ వైద్యపత్రాలు లేకపోవటంతో అధికారులు వారిని ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు వారందరూ భారత్‌ చేరుకున్నారు. 


More Telugu News