పదవీ విరమణ చేసిన సిబ్బంది మళ్లీ విధుల్లోకి : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

  • గడచిన ఐదేళ్లలో రిటైరైన వైద్యులు, నర్సులకు అవకాశం
  • మూడు నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం
  • కరోనాపై ముందు జాగ్రత్త చర్యల నేపథ్యంలో నిర్ణయం
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేసులు ఇంకా పెరిగితే బాధితులకు విస్తృత సేవలందించే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. గడచిన ఐదేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. 

వీరందరికీ కాంట్రాక్టు పద్ధతిలో మూడు నెలలపాటు పోస్టింగ్‌ ఇవ్వాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తే బాధితులకు ఏ రకమైన సేవలందించాలన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం పరిస్థితి తీవ్రమైనప్పుడు వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఈనిర్ణయం తీసుకుంది.


More Telugu News