న్యూమోనియా బాధితులకూ కరోనా పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

  • కరోనా కట్టడంలో ప్రభుత్వం మరో అడుగు
  • తమిళనాడు, మహారాష్ట్రలలో విదేశీ ప్రయాణాలు చేయని వారికీ కరోనా
  • ఎన్‌సీడీసీకి సమాచారం అందించాలన్న ప్రభుత్వం
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి, వారిని కలిసిన వారికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, మహారాష్ట్రలలో విదేశీ ప్రయాణాలు చేయని వారికి కూడా కరోనా వైరస్ సోకడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఊపిరితిత్తుల సమస్య (న్యూమోనియా)తో బాధపడుతున్న వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. న్యూమోనియాతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ తొందరగా సోకే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యూమోనియాకు చికిత్స పొందుతున్న వారి వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)కి అందించాలని వైద్యాధికారులను ఆదేశించింది.


More Telugu News