నెల్లూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్న కుటుంబం
- రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
- మర్రిపాడు మండలం నందవరంలో రేపు జరగాల్సిన పెళ్లి
- కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారానికి వాయిదా
ఏపీలోనూ కరోనా మహమ్మారి ఉనికి చాటుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ గా వెల్లడవుతున్నా, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఓ కుటుంబం పెళ్లిని వాయిదా వేసుకుని స్ఫూర్తిని చాటింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించిన ఆ కుటుంబం జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన వివాహ వేడుకను సైతం ప్రజాక్షేమం కోసం పక్కనబెట్టింది. మర్రిపాటు పండలం నందవరంలో ఈ పెళ్లి రేపు జరగాల్సి ఉండగా, కర్ఫ్యూ ప్రభావంతో సోమవారానికి వాయిదాపడింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే పెళ్లిని వాయిదా వేసినట్టు ఆ కుటుంబం వెల్లడించింది.