నా ఫేవరెట్ భారత క్రికెటర్ కోహ్లీనే: పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్
- రికార్డులు, గణాంకాలే అతనేంటో చెబుతాయి
- కోహ్లీ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం
- భారత కెప్టెన్‌పై మియాందాద్ పొగడ్తల వర్షం
భారత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ప్లేయర్ అని పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ అన్నాడు. కోహ్లీ సత్తా ఏమిటో అతని రికార్డులే చెబుతాయన్నాడు. అయితే, విరాట్ క్లాసిక్ బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ప్రస్తుత భారత జట్టు ప్రతిభ, దాని బలం గురించి ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన జావెద్ ప్రత్యేకంగా విరాట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతని అద్భుత గణాంకాల గురించి, వాటిని అందుకున్న తీరును కొనియాడాడు.
‘భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ. నేను అతని గురించి చెప్పాల్సిన పని లేదు. తన ప్రదర్శనలే అతని సత్తా ఏమిటో చెబుతాయి. రికార్డులు అంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఒప్పుకోవాలి. దక్షిణాఫ్రికాలో విరాట్ బాగా రాణించాడు. క్లిష్టమైన పిచ్‌పై కూడా అతను సెంచరీ సాధించాడు. అతను ఫాస్ట్ బౌలర్లకు భయపడుతాడనో, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడనో లేదా స్పిన్నర్లను సరిగ్గా ఎదుర్కోలేడనో చెప్పడానికి వీల్లేదు. కోహ్లీ క్లియర్ హిట్టర్. అతను ఆడే షాట్లు చూడండి. అతనో క్లాస్ ప్లేయర్. అతని బ్యాటింగ్ చూడ్డానికి చాలా బాగుంటుంది’ అని మియాందాద్ చెప్పుకొచ్చాడు.