12 మంది రైల్వే ప్రయాణికులకు కరోనా: భారత రైల్వే శాఖ ప్రకటన

  • వాళ్లు రెండు వేర్వేరు రైళ్ళలో ప్రయాణించారని వెల్లడి
  • అందులో ఎనిమిది మంది ఢిల్లీ నుంచి రామగుండం వరకు ప్రయాణం
  • ప్యాసింజర్, సూదూరం వెళ్లే రైళ్లలో ప్రయాణాలు వద్దని ప్రజలకు సూచన
రెండు వేర్వేరు రైళ్లలో ప్రయాణించిన పన్నెండు మందికి కరోనా వైరస్‌ సోకిందని భారత రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. వాళ్లంతా ఈ మధ్య కాలంలోనే ప్రయాణం చేశారని తెలిపింది. వీరిలో ఎనిమిది మంది ఏపీ సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 13న ఢిల్లీ నుంచి రామగుండం వరకు వచ్చారని గుర్తించింది. మరో నలుగురు గోదాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16న ముంబై నుంచి జైపూర్ వరకు ప్రయాణం చేశారని తెలిపింది.

కరోనా నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించొద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. అలాగే, అత్యవసరం ఉంటే తప్ప సుదూరం వెళ్లే  రైళ్లలో ప్రయాణం చేయొద్దని తెలిపింది.


More Telugu News