తెలంగాణలో రేపు మద్యం షాపులు కూడా బంద్!

  • మూత పడనున్న 2400 వైన్ షాపులు
  • జనతా కర్ఫ్యూకు తెలంగాణ వైన్స్ డీలర్ల సంఘం మద్దతు
  • రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు  జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణలో ఆదివారం మద్యం షాపులు కూడా మూతపడనున్నాయి. దేశ ప్రజలంతా ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడం, అవసరమైతే తెలంగాణను షట్‌డౌన్‌ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రేపు అన్ని వైన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు తెలంగాణ వైన్స్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావు ప్రకటించారు. మొత్తం 2,400  వైన్‌ షాపులు రేపు బంద్ పాటిస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 700 బార్లు మూసేశారని తెలిపారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్న ప్రధాని మోదీ రేపు ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని కోరిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు బయటికి రావొద్దని సూచించారు.


More Telugu News