అలాంటి పరిస్థితి వస్తే.. తెలంగాణను షట్ డౌన్ చేయడానికి కూడా సిద్ధమే!: కేసీఆర్
- పరిస్థితి చేజారితే పూర్తిగా షట్ డౌన్ చేస్తాం
- ప్రజలకు నిత్యావసరాలను ఇంటికే పంపిస్తాం
- కరోనా కట్టడికి రూ. 10 వేల కోట్లను ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమే
కరోనా కట్టడికి అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఒకవేళ కరోనా విజృంభించే పరిస్థితి వస్తే మాత్రం పూర్తిగా షట్ డౌన్ చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరినీ వారి ఇళ్లకే పరిమితం చేస్తామని... ప్రభుత్వమే వారికి అవసరమైన నిత్యావసరాలను అందించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాంటి పరిస్థితి రాకూడదనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దులను మూసేస్తామని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.
కరోనా వైరస్ కు ఆత్మాభిమానం చాలా ఎక్కువని కేసీఆర్ చమత్కరిస్తూ.. దానంతట అది మన ఇంటికి రాదని... దాని దగ్గరకు మనం వెళ్లి, పిలిస్తేనే అది మనింటికి వస్తుందని చెప్పారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... దేన్నైనా ముట్టుకున్న తర్వాత ముఖాన్ని టచ్ చేయవద్దని సూచించారు. చర్మం ద్వారా కరోనా మన శరీరంలోకి ప్రవేశించదని... ముఖం ద్వారానే శరీరంలోకి వెళ్తుందని చెప్పారు.