రేపు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలి: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

  • ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
  • అత్యవసర సేవలకు పోలీసులు సంసిద్ధంగా ఉండాలన్న డీజీపీ
  • పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడి
రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తుండడం పట్ల ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని, జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్ ను జయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవలు అందించేందుకు సంసిద్ధులై ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News