కరోనాపై పోరు.. కేరళలో ఒక్క రోజులో లక్ష శానిటైజర్లను ఉత్పత్తి చేసిన సిబ్బంది

  • శానిటైజర్లు, మాస్క్‌ల కొరతతో ప్రత్యేక దృష్టి పెట్టిన కేరళ సర్కారు
  • శానిటైజర్లు అందుబాటులో ఉంచడానికి స్వయంగా చర్యలు
  • కేరళ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శానిటైజర్ల ఉత్పత్తి 
  • 200 మంది ఉద్యోగులు మూడు షిప్టులలో పని
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో తీసుకుంటున్న జాగ్రత్తల కోసం ఒక్కరోజులోనే లక్ష శానిటైజర్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. దేశంలో కరోనా పెరిగిపోతోన్న నేపథ్యంలో శానిటైజర్లు, మాస్క్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనాను ఎదుర్కోవాలంటే ఆ రెండు చాలా ముఖ్యం.

కేరళలో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ మరింత అప్రమత్తమై శానిటైజర్లు, మాస్క్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి స్వయంగా చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష శానిటైజర్ బాటిళ్లను కేరళ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కరోజులోనే ఉత్పత్తి చేశారు.

శానిటైజర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశామని ఆ రాష్ట్ర మంత్రి జయ రాజన్ చెప్పారు. ఇందుకోసం 200 మంది ఉద్యోగులు మూడు షిప్టులలో పనిచేశారని తెలిపారు. ఇతర మందుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసి మరీ వీటిని తయారు చేసినట్లు వివరించారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ముడి సరుకును అందించిందని ఆయన వివరించారు.


More Telugu News