ఎన్నికల సంఘం కమిషనర్‌ని సైతం బూతులు తిడుతూ బెదిరించారు: బుద్ధా వెంకన్న
- మీరు చేస్తున్న అకృత్యాలపై రమేశ్ కుమార్ గారు కేంద్రానికి లేఖ రాశారు
- విచారణ ప్రారంభమైంది
- ఊచలు లెక్కపెట్టడం ఖాయం
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. 'అధికారుల లేఖలతో జగన్ గారితో పాటు మీకు కూడా మైండ్ బ్లాంక్ అయినట్టు ఉంది విజయసాయిరెడ్డి గారు. అధికార దాహంతో స్థానిక ఎన్నికల సందర్భంగా దౌర్జన్య పర్వానికి తెరలేపారు. హత్యాయత్నాలు చేశారు. పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఓటమి భయంతో నీచమైన పనులు చేశారు' అని తెలిపారు.
'ఆఖరికి ఎన్నికల సంఘం కమిషనర్ ని సైతం బూతులు తిడుతూ బెదిరించారు. మీరు చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్టు రమేశ్ కుమార్ గారు కేంద్రానికి లేఖ రాశారు. విచారణ ప్రారంభమైంది.. చేసిన అరాచకాలకు త్వరలోనే ఏ 1, ఏ 2లతో పాటు విచ్చలవిడిగా నోటితో రెచ్చిపోయిన వారు సైతం ఊచలు లెక్కపెట్టడం ఖాయం' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.