మోదీ 'జనతా కర్ఫ్యూ'పై కాసేపట్లో కేసీఆర్‌ మీడియా సమావేశం.. రేపు హైదరాబాద్‌ మెట్రో రైల్ సేవలు బంద్

  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్న ఇంద్రకరణ్‌రెడ్డి
  • దేవాలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది
  • దేవాదాయ శాఖ కార్యాలయంలోనే ఉగాది పంచాంగ పఠనం  
  • మంత్రులు, ఎమ్మెల్యేలతోనే భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుక
కరోనా వ్యాప్తి, రేపు ప్రధాని మోదీ ఇచ్చిన 'జనతా కర్ఫ్యూ' పిలుపు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి తమ నిర్ణయాలను ప్రకటించనున్నారు. కాగా, 'జనతా కర్ఫ్యూ' లో భాగంగా రేపు హైదరాబాద్ మెట్రో  రైలు సేవలను నిలిపివేస్తున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ తగ్గిందని తెలిపారు. దేవాదాయ శాఖ కార్యాలయంలోనే ఉగాది పంచాంగ పఠనం నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి పంచాగ పఠనం వీక్షించాలని కోరారు.

భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలు యథావిధిగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కల్యాణ ఆహ్వాన పత్రికలు ముద్రించలేదని చెప్పారు. భక్తులు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతోనే కల్యాణ వేడుక ఉంటుందని వివరించారు.


More Telugu News