షూటింగులు బంద్‌ కావడంతో ఇంట్లో అల్లు అర్జున్‌ ఏం చేస్తున్నాడో చూడండి!

  • తన బామ్మతో సరదాగా గడిపిన బన్నీ
  • వైరల్ అవుతోన్న పిక్
  • బన్నీకి ముద్దు పెట్టిన బామ్మ
కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలో వారు తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన బామ్మ (అల్లు రామలింగయ్య భార్య)తో కలిసి దిగిన ఫొటో బయటకు వచ్చింది. బామ్మతో ఆయన సరదాగా గడిపాడు. మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ ఫొటోను ఆయన భార్య స్నేహ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రియమైన వ్యక్తులతో క్వారంటైన్ లైఫ్ గడపడం మంచి అనుభూతి అని పేర్కొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.


More Telugu News