అప్పుడు అతని ప్రేమలో పడ్డా.. కొన్ని పరిస్థితుల్లో మేమిద్దరం విడిపోయాం: హీరోయిన్ అనుష్క
- 2008లో నేను ప్రేమలో పడ్డా
- ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని చెప్పను
- నేను, ప్రభాస్ మాత్రం మంచి స్నేహితులం
హీరోయిన్ అనుష్క ఎవరినో ప్రేమిస్తోందని ఎన్నో వదంతులు వచ్చాయి. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క పలు విషయాలు తెలిపింది. తనకంటూ సొంత జీవితం ఉంటుందని, ఇందులో కొందరు కల్పించుకుంటుండటం తనకు నచ్చడం లేదని చెప్పింది.
తన ప్రేమ, పెళ్లి గురించి కొందరు ఎన్నో ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని అనుష్క వాపోయింది. 2008లో తాను ప్రేమలో పడ్డానని, అదో తీయని ప్రేమ అని చెప్పింది. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయామని తెలిపింది. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను చెప్పబోనని పేర్కొంది. తాను, ప్రభాస్ మాత్రం మంచి స్నేహితులమని తెలిపింది. కాగా, ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చేనెల 2న విడుదలవుతుంది.