మోదీ సూచనలు పాటిద్దాం: చిరంజీవి
- 'జనతా కర్ఫ్యూ' పాటిద్దాం
- అధికారులను ప్రశంసించాల్సిన సమయమిది
- కరోనా లేని భారతావనిని సాధిద్దాం
రేపు 'జనతా కర్ఫ్యూ'ను ప్రజలందరూ పాటించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులను ప్రశంసించాల్సిన సమయమిదని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దామని చిరంజీవి అన్నారు. ఇళ్లకే పరిమితమవుదామని, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి గుమ్మాల్లోకి వచ్చి సేవలందిస్తున్న వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిదని ఆయన వాఖ్యానించారు.
అది మన ధర్మమని, భారతీయులుగా మనం అందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడదామని చిరు పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందామని, సామాజిక సంఘీభావం పలుకుదామని చెప్పారు. కరోనా లేని భారతావనిని సాధిద్దామని అన్నారు.