1006 మంది అనుమానితులకు పరీక్షలు: ఏపీ ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ విడుదల

  • 135 మంది అనుమానితుల నమూనాలు ల్యాబ్‌కు
  • 108 మందికి నెగెటివ్‌... ముగ్గురికి పాజిటివ్‌
  • 24 మంది నమూనాల నివేదిక రావాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వెయ్యి ఆరు మంది అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక బులెటిన్‌లో పేర్కొంది. వీరిలో 135 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. అందులో 108 మందికి నెగెటివ్‌ రాగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొంది. మిగిలిన 24 మంది నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఇక, మిగిలిన అనుమానితుల్లో  28 రోజుల వైద్య పరీక్షల అనంతరం 259 మందిని ఇళ్లకు పంపించేశామని, మరో 711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని బులెటిన్‌లో వెల్లడించింది. మరో 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.


More Telugu News