హైదరాబాదులో ఐకియాతో పాటు పలు అంతర్జాతీయ స్టోర్ల మూసివేత!
- ఈరోజు నుంచి స్టోర్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన ఐకియా
- ఇప్పటికే మూతపడ్డ నైకీ, అడిడాస్, యాపిల్ స్టోర్లు
- ఉద్యోగులు, వినియోగదారుల భద్రత రీత్యా కీలక నిర్ణయాలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో పలు అంతర్జాతీయ స్టోర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదులోని తమ స్టోర్ ను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఫర్నిచన్ జెయింట్ ఐకియా ఓ ప్రకటనలో పేర్కొంది.
దీంతో పాటు నగరంలోని నైకీ, అడిడాస్, యాపిల్ వంటి అంతర్జాతీయ స్టోర్లు కూడా మూతపడ్డాయి. తమ ఉద్యోగులు, వినియోగదారుల సంక్షేమం కోసమే స్టోర్లను మూసివేస్తున్నట్టు ఈ కంపెనీలు తెలిపాయి. మరోవైపు హైదరాబాదులో కరోనా విస్తరించకుండా జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నగరాన్ని పూర్తిగా శుభ్రం చేయిస్తోంది.