కరోనాపై కువైట్ పోరు.. రెండేళ్ల చిన్నారి సహా 160 మంది తెలుగు వారిపై బహిష్కరణ వేటు!
- విదేశీయులను స్వదేశానికి పంపుతున్న కువైట్
- ప్రత్యేక విమానంలో 350 మందిని భారత్‌కు పంపిన వైనం
- తెలుగువారిలో అత్యధికులు కడప జిల్లా వారే
కరోనాపై పోరు ప్రారంభించిన కువైట్.. అక్కడున్న విదేశీయులను అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తోంది. తాజాగా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశం తరలిస్తోంది. కువైట్ అదుపులోకి తీసుకున్న 350 మందిలో 160 మంది తెలుగువారే కావడం గమనార్హం. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, తెలుగువారిలోనూ అత్యధికులు కడప జిల్లావారేనని సమాచారం. ప్రస్తుతం కువైట్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ కువైట్ రాజు ఇచ్చిన అనుమతితో 350 మందితో కూడిన ప్రత్యేక విమానం నిన్న రాత్రి భారత్‌కు బయలుదేరింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తారు.