ఢిల్లీ మురికివాడలో నిర్భయ దోషుల తల్లులు.. ఊరడించిన బంధువులు!
- దోషులకు నిన్న ఉరిశిక్ష అమలు చేసిన జైలు అధికారులు
- తీహార్ జైలుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మురికివాడ
- కన్నీటి పర్యంతమైన దోషుల తల్లులు
నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు నిన్న ఉరిశిక్ష అమలు చేశారు. ఉరితీత తర్వాత నిర్భయ తల్లి సహా దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. అయితే, తీహార్ జైలుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికివాడ రవిదాస్ కాలనీ మాత్రం విషాదంలో మునిగిపోయింది.
నిర్భయ దోషులు ఆరుగురిలో నలుగురు ఇక్కడివారే. వారిలో ఒకడైన బస్సు డ్రైవర్ రాంసింగ్ 2013లో జైలు గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. అతడి సోదరుడు ముఖేశ్ సింగ్‌కు కూడా మరణశిక్ష పడిన తర్వాత వారి తల్లి అక్కడ ఉండలేకపోయింది. రాజస్థాన్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది. వినయ్‌శర్మ, పవన్ గుప్తా కుటుంబాలు కూడా ఇక్కడే ఉండేవి.
నిన్న వారికి ఉరిశిక్ష అమలు చేస్తున్నప్పుడు వారి తల్లుల రోదనలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. జైలులో ఉన్నా బతికి ఉన్నారని అనుకునేవారమని, ఇప్పుడు కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఊరడించేందుకు బంధువులు కష్టపడాల్సి వచ్చింది. వారి రోదనలతో ఆ మురికివాడ మొత్తం విషాదంతో నిండిపోయింది.