నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ ప్రసాద్

  • సెర్బియా నుంచి హైదరాబాద్ వచ్చిన నిమ్మగడ్డ
  • క్వారంటైన్ కు తరలింపు
  • సీబీఐ కోర్టులో మెమో దాఖలు
  • సెర్బియా నిర్బంధంలో ఉండడం వల్ల విచారణకు రాలేకపోయానని వెల్లడి
వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డపై క్విడ్ ప్రో కో ఆరోపణలు ఉన్నాయి. రస్ అల్ ఖైమా సంస్థ ఫిర్యాదుతో సెర్బియాలో అరెస్టయిన నిమ్మగడ్డ ఇటీవలే విడుదలై నిన్న హైదరాబాద్ చేరుకున్నారు.

 తాజాగా ఆయన తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మెమో దాఖలు చేశారు. సెర్బియాలో నిర్బంధంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోయానని మెమోలో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్టు వెల్లడించారు. కరోనా స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయ్యాక పాస్ పోర్టు కోర్టుకు అప్పగిస్తానని తెలిపారు.


More Telugu News