రెండు వారాల్లో లక్షా ఇరవై ఆరు వేల ఉద్యోగాలతో చరిత్ర సృష్టించాం: రాజ్యసభలో విజయసాయి వ్యాఖ్యలు
- రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం
- ఉద్యోగాల కల్పనలో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలన్న విజయసాయి
- ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం నిరంతర ప్రక్రియగా పేర్కొన్న వైనం
నిరుద్యోగ సమస్య- పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ అనే అంశంపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించిందని తెలిపారు. తద్వారా గ్రాడ్యుయేట్లకు గ్రామ సచివాలయాల్లో ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఇటీవల వచ్చిన పే కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 38.9 లక్షల ఉద్యోగాలు మంజూరైతే, 31 లక్షల ఉద్యోగాలే భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం ఒక నిరంతర ప్రక్రియ అని, వాటిని భర్తీ చేయకపోవడం వల్ల లక్షలమంది యువత అవకాశాలను హరించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.