‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి: పవన్ కల్యాణ్
- మోదీ సూచనలు తెలుగు వారందరూ పాటించాలి
- ఈ నెల 22న ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’ పాటిద్దాం
- 24 క్రాఫ్ట్లకు సంబంధించిన ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భారంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘కరోనా’పై పోరాటంలో భాగంగా ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలని కోరుతూ ఓ వీడియోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలని, ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, నటీనటులు, 24 క్రాఫ్టులకు సంబంధించిన ప్రతీ ఒక్కరూ దీనిలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నానంటూ పవన్ ఓ పోస్ట్ చేశారు.