కరోనా ఎఫెక్ట్: ఏపీలో ఏప్రిల్ 5 వరకు లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు రద్దు

  • కరోనా నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన రవాణాశాఖ
  • అస్వస్థతకు గురైన ఉద్యోగులు చికిత్స తీసుకోవాలని సూచన
  • వారికి వెంటనే సెలవు మంజూరు చేస్తామని వెల్లడి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరణను దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 5 వరకు ఏపీలో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు రవాణశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. అప్పటి పరిస్థితిని అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రవాణా శాఖ కార్యాలయాలు తరచుగా శుభ్రం చేయాలని సూచించారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు వెంటనే సెలవులు మంజూరు చేస్తామని చెప్పారు.


More Telugu News