అవయవదానం చేసిన 'నిర్భయ దోషి' ముకేశ్ సింగ్!
- రాతపూర్వకంగా అవయవ దానం చేసిన ముకేశ్
- తాను వేసిన పెయింటింగ్‌లను జైలు సూపరింటెండెంట్‌కు ఇచ్చిన వినయ్
- ఎటువంటి కోరికలూ కోరని పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్
నిర్భయ దోషులను ఈ రోజు ఉదయం తీహార్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. అంతకు ముందు వారి చివరి కోరిక ఏంటన్న విషయాలను జైలు అధికారులు రికార్డు చేసుకున్నారు. చనిపోయే ముందు దోషి ముకేశ్ సింగ్.. మరణానంతరం తన అవయవాలను దానం చేసేందుకు అంగీకరించాడని, ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశాడని తీహార్ జైలు సిబ్బంది తెలిపారు.
కాగా, మరో దోషి వినయ్ శర్మ తాను వేసిన పెయింటింగ్‌లను జైలులోనే ఉంచాలని జైలు సూపరింటెండెంట్‌ను కోరాడు. తన వద్ద ఎల్లప్పుడూ ఉంచుకునే హనుమాన్ చాలీసా, ఓ ఫొటోగ్రాఫ్‌ను తన కుటుంబ సభ్యులకు అందించాలని అతడు చెప్పాడు. మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ ఎటువంటి కోరికలూ కోరలేదు. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఈ రోజు ఉదయం 4.45 గంటలకు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. ఉరితీత తర్వాత దోషుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.