భారత్‌లో 206కి చేరిన కరోనా బాధితులు.. నిర్ధారించిన ఐసీఎమ్‌ఆర్‌

  • దేశంలో కొత్తగా మరో 33 కేసులు
  • మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 52 
  • దేశంలో ఇప్పటివరకు 14,376 శాంపిళ్ల సేకరణ
  • 13,486 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపిన ఐసీఎమ్‌ఆర్
భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం వరకు కరోనా బాధితుల సంఖ్య 197గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య ఇప్పుడు 206కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) నిర్ధారించింది. ఈ రోజు ఒక్కరోజు దేశంలో 33 కేసులు నమోదయ్యాయి.

ఏపీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ల్లో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మొత్తం కలిపి 30 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్ బాధితులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 52గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 14,376 శాంపిళ్లను సేకరించి 13,486 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎమ్‌ఆర్ తెలిపింది. 


More Telugu News