జనతా కర్ఫ్యూపై నాగబాబు స్పందన

  • జనతా కర్ఫ్యూకి మోదీ పిలుపునివ్వడం మంచి పరిణామం
  • దీన్ని మనం పాటించకపోతే.. చట్బద్ధంగా కర్ఫ్యూని అమలు చేసే అవకాశం ఉంది
  • చైనా తరహాలో మనం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి
కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి మార్చి 22న జనతా కర్ఫ్యూని పాటిద్దామని ప్రధాని మోదీ పిలుపునివ్వడం మంచి పరిణామమని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. జనతా కర్ఫ్యూని మనం పాటించకపోతే... ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా కర్ఫ్యూని అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రానికి నాగబాబు ఒక సూచన చేశారు. చైనా తరహాలో మనం కూడా కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఒక ప్రాంతంలో కరోనా వైరస్ 12 గంటల పాటు బతికే అవకాశం ఉంటుందని... జనతా కర్ఫ్యూని 14 గంటల పాటు పాటించడం వల్ల.. పబ్లిక్ ప్రాంతాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ సజీవంగా ఉన్న కరోనా వైరస్ 14 గంటల పాటు ఎవరినీ సోకలేదని చెప్పారు. దీంతో, కరోనా విస్తరించే చైన్ తెగిపోతుందని తెలిపారు.


More Telugu News