ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో.. మొక్కలు తొలగించినందుకు రూ. 50 వేల జరిమానా విధించిన ఆటవీశాఖ!
- ఇనార్బిట్ మాల్ నుంచి ఐకియా వరకు ఉన్న 60 మొక్కల తొలగింపు
- జరిమానా విధించిన అటవీ శాఖ
- మరో 180 మొక్కలు నాటాలని ఆదేశం
ఎలాంటి అనుమతి లేకుండా మొక్కలను తొలిగించిన రియల్టర్లపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్ నుంచి ఐకియా షోరూం వరకు ఉన్న దాదాపు 60 మొక్కలను ఎలాంటి అనుమతి లేకుండా తొలగించిన వారిపై రూ. 50 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా కొత్తగా 180 మొక్కలు నాటాలని ఆదేశించారు. సలార్‌పురియా సత్వా కాంప్లెక్స్ దగ్గర ట్రాఫిక్స్ సజావుగా నడిచేందుకు 60 మొక్కలు తొలగించినట్టు తాము గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ తెలిపారు.
ఈ మొత్తం జరిమానాను సత్వా కాంప్లెక్స్‌కు సంబంధించిన అమిత్ బగ్లా అనే వ్యక్తి చెల్లించారు. అయితే, ఈ జరిమానా చాలా తక్కువ అని మొక్కలు తొలిగించిన విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన హరీష్ అనే సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. తొలగించిన మొక్కల సంఖ్య దాదాపు వందపైనే ఉంటుందని, ఆ స్థలంలో రోడ్డు కూడా వేశారని చెప్పారు. చిన్న మొత్తం జరిమానా విధిస్తే అభివృద్ధి పేరుతో ఇలాంటి పని చేసే ఇతరులను అడ్డుకోలేమన్నారు.