పెద్ద పులి నైజమే అంత... కాపాడిన వారిపైనే దాడి చేస్తున్న వీడియో ఇదిగో!
- గుంతలో పడ్డ పులిని కాపాడే ప్రయత్నం
- బయటకు రాగానే జనాలపై దాడి
- వీడియో పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
ఓ గుంతలో పడిపోయిన పెద్దపులిని కొందరు స్థానికులు కాపాడగా, అది పైకి వచ్చి వారిపైనే దాడి చేసిన భయానక వీడియో ఇది. ఈ వీడియోను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్ట్ చేశారు.
"ఇదో భయానక ఘటన. క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమే ఇందుకు కారణం. వారెవరూ వాస్తవానికి అక్కడ ఉండనక్కర్లేదు. అక్కడ బోను కూడా లేదు. పెద్దపులికి మత్తిచ్చేందుకు శిక్షణ పొందిన వారు లేరు. కాబట్టి, ఎవరూ ఇటువంటి అర్థరహిత పనులను చేసేందుకు ఉత్సాహం చూపించవద్దు. ఈ పెద్దపులి ఇలా ఎందుకు చేసిందని నన్ను అడుగుతున్నారు. అది పెద్దపులి కదా... అందుకే" అంటూ ఆయన కామెంట్ చేశారు.
పెద్దపులి గుంతలో పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు, కొందరు అటవీ అధికారులు దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. దాదాపు గంట తరువాత అది బయటపడి, ఆ వెంటనే జనాలను చూసి బెదిరిపోయి, దాడికి దిగింది. ఓ వ్యక్తి పైకి ఎక్కేసి, అతన్ని కిందకు తోసింది. మరో వ్యక్తిపైనా దాడి చేసింది. ఆపై అడవుల్లోకి పారిపోయింది. సుశాంత నందా ఫార్వార్డ్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.