నరేంద్ర మోదీ సూచనలు పాటించండి: చంద్రబాబు పిలుపు

  • భారత్‌లో కరోనా పెరిగిపోతోంది
  • పరిస్థితులను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలిపారు
  • కరోనా వ్యాప్తి వల్ల దేశం పరీక్ష ఎదుర్కొంటోన్న సమయం ఇది
  • వెంటనే దీనిపై మనమంతా పోరాడాలి 
భారత్‌లో కరోనా వైరస్‌ బాధితులు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సూచనలను పాటించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పిలుపునిచ్చారు.

'భారత్‌లో కరోనా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలిపారు. కరోనా వ్యాప్తి వల్ల దేశం పరీక్ష ఎదుర్కొంటోన్న సమయం ఇది. వెంటనే దీనిపై మనమంతా పోరాడాలి. ప్రజల రక్షణ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నేను కోరుతున్నాను. అందరూ ఏకమై ఈ భయంకర వైరస్‌పై పోరాడాలని తెలుగు దేశం శ్రేణులతో పాటు ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను' అని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం వీడియోను పోస్టు చేశారు. 


More Telugu News