బలపరీక్షకు ముందు కమల్‌నాథ్ సర్కారుకు షాక్.. 16 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాకు స్పీకర్ ఆమోదం!

  • ఈ-మెయిల్ ద్వారా అందిన రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
  • నేటి సాయంత్రంలోగా బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీం ఆదేశం
  • బీజేపీ బలం 107.. 104కు పడిపోయిన కాంగ్రెస్ బలం
బలపరీక్షకు సిద్ధమవుతున్న కమల్‌నాథ్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 10న ఈ-మెయిల్ ద్వారా కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడం సంచలనమైంది. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలందరూ బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్నారు. బెంగళూరులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది రాజీనామాలను ఆమోదించినట్టు తాజాగా స్పీకర్ తెలిపారు. న్యాయవ్యవస్థ మార్గదర్శకాలను అసెంబ్లీ పాటిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం ఇప్పుడు 104కు పడిపోయింది. అదే సమయంలో బీజేపీ బలం 107గా ఉండడంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మార్గం సుగమమైంది. మరోవైపు నేటి సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ స్పీకర్ ప్రజాపతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.


More Telugu News