షట్ డౌన్ కాబోతున్న ఇండియా.. ఆదివారం నుంచి అన్ని విదేశీ విమానాలు బంద్!

  • ఇండియాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • అప్రమత్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • విదేశాల నుంచి కరోనా మన దేశంలోకి విస్తరించకుండా కఠిన చర్యలు
మన దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ ఆందోళన కలిగించే స్థాయిలో లేనప్పటికీ... చాప కింద నీరులా అది విస్తరిస్తున్న మాట మాత్రం నిజం. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి.

మరోవైపు, విదేశాల నుంచి వస్తున్న వారి నుంచే ఈ మహమ్మారి మన దేశంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాను షట్ డౌన్ చేయబోతోంది. విదేశాల నుంచి వచ్చే విమానాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించనుంది. ఆదివారం నుంచి విదేశాల నుంచి మన దేశంలోకి ఒక్క విమానాన్ని కూడా అనుమతించబోరు.

మరోవైపు ప్రధాని మోదీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 10 ఏళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయడం బెటర్ అని చెప్పారు.


More Telugu News