బీ కేర్‌ఫుల్.. కరోనా బాధితుల్లో అత్యధికులు ఆ బ్లడ్ గ్రూప్ వారేనట!
- కరోనా బాధితుల్లో అత్యధికులు ఎ-బ్లడ్ గ్రూపు వారే
- జింగ్ హువాన్ సంస్థ సర్వేలో వెల్లడి
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
కరోనా బాధితులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది. తమ దేశంలో ఆ వైరస్‌తో బాధపడుతున్న రోగులపై జింగ్ హువాన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కరోనా బాధితుల్లో ఎ-బ్లడ్ గ్రూపు వారే అత్యధికులని తేలింది. ఈ వైరస్ బారినపడి మృతి చెందిన 206 మందిలో 85 మంది ఎ-బ్లడ్ గ్రూపు వారే ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, వారు ఈ వైరస్ బారిన పడడం యాదృచ్ఛికమా? లేక, ఆ బ్లడ్ గ్రూపు వారికి వైరస్ త్వరగా సోకుతుందా? అన్నది తెలియరాలేదు. అయితే, బాధితుల్లో మాత్రం వారే ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు దృష్టి కేంద్రీకరించారు. ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారు మరింత జాగురూకతతో ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.