చివరి కోరిక చెప్పమన్న అధికారులు.. మౌనమే నిర్భయ దోషుల సమాధానం!
- ఒక్కరు కూడా వెల్లడించని వైనం
- రాత్రంతా వేర్వేరు గదుల్లో నిర్భయ దోషులు
- ఉదయం 17 మంది పర్యవేక్షణలో శిక్ష అమలు
చివరి కోరిక చెప్పకుండానే నిర్భయ దోషులు ఉరికంబం ఎక్కారు. చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పాలని ఉరితీతకు ముందు దోషులను తీహార్ జైలు అధికారులు అడిగారు. అయితే, వారి నుంచి మౌనమే సమాధానం అయింది. దోషులు ముఖేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లలో ఏ ఒక్కరు కూడా తమ చివరి కోరికను వెల్లడించలేదు. అనంతరం అనుకున్న సమయం ప్రకారం వారిని ఉరితీశారు.
ప్రొటోకాల్ ప్రకారం అరగంటపాటు వారిని అలాగే ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత మృతదేహాలను కిందికి దించారు. పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్టు నిర్ధారించిన తర్వాత పోస్టుమార్టానికి తరలించారు. కాగా, ఉరితీతకు ముందు వారిని రాత్రంతా వేర్వేరు గదుల్లో ఉంచినట్టు తెలుస్తోంది. ఉదయం 17 మంది సిబ్బంది పర్యవేక్షణలో వారిని ఉరి తీశారు.