కరోనా మరణాల్లో చైనాను అధిగమించిన ఇటలీ.. ఒక్క నెలలోనే రూ.3,405కు చేరిన మృతుల సంఖ్య

  • కరోనా కాటుకు చైనాలో 3245 మంది బలి
  • చైనాలో బుధవారం ఒక్క కేసూ నమోదు కాని వైనం
  • స్పెయిన్‌లో 209 నుంచి 767కు పెరిగిన మృతుల సంఖ్య
చైనాను అల్లాడించిన కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది. వైరస్ పుట్టిన చైనాలో మాత్రం నిన్నటి వరకు నమోదైన మరణాలు 3245 మాత్రమే. ఇటలీలో 24 గంటల వ్యవధిలోనే 427 మరణాలు సంభవించడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.

మరోవైపు, చైనాలో పురుడు పోసుకున్న ఈ మహమ్మారి అక్కడ క్రమంగా కనుమరుగవుతోంది. బుధవారం అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యశాఖ నిర్ధారించింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. స్పెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 209 నుంచి ఒక్కసారిగా 767కు పెరగడం గమనార్హం.


More Telugu News