తెలంగాణలో ‘కరోనా’ నియంత్రణకు ప్రత్యేక నిధుల మంజూరు
- రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.116.26 కోట్లు విడుదల
- ఈ మేరకు ఉత్తర్వులు విడుదల
- క్వారంటైన్ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్న నిధులు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.116.26 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను క్వారంటైన్ ఏర్పాట్లు, స్క్రీనింగ్ కోసం, ప్రత్యేక ల్యాబ్స్ ఏర్పాటుకు, పరికరాల కొనుగోలు నిమిత్తం వినియోగిస్తారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈ నిధులు విడుదల చేస్తూ విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.