ఎస్​ఈసీ పేరిట రాసిన లేఖపై డీజీపీకి ఫిర్యాదు.. చంద్రబాబుపై అంబటి ఫైర్ ​

  • గౌతమ్ సవాంగ్ ని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
  • రమేశ్ కుమార్ ధ్రువీకరించకపోయినా ఆ పత్రికలు ప్రచురించాయి
  • రమేశ్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్ర
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తనకు రక్షణ కల్పించాలంటూ లేఖ రాయలేదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, రమేశ్ కుమార్ పేరిట ఈ లేఖ సర్క్యులేట్ కావడంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో అంబటి రాంబాబు, పార్ధసారథి, శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.  

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక మనిషి రాసిన రాతలకు ధ్రువీకరణ లేకపోయినా పత్రికలు ప్రచురిస్తాయా? అంటూ ‘ఈనాడు‘, ఆంధ్రజ్యోతి’పై మండిపడ్డారు. సీఎం జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే రమేశ్ కుమార్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కనుక రాస్తే ధైర్యంగా ఒప్పుకోవాలని అన్నారు. ఈ లేఖపై వాస్తవాలు బయటకొచ్చే వరకూ తాము పోరాడతామని అన్నారు.


More Telugu News