పారితోషికం పెంచేసిన సింగర్ సిద్ శ్రీరామ్

  • సిద్ శ్రీరామ్ గాత్రంలో ప్రత్యేకత 
  • పాటల్లో హిట్లు ఎక్కువ 
  •  ఒక్కో పాటకి పారితోషికం 5 లక్షలు    
ఈ మధ్య కాలంలో సింగర్ గా సిద్ శ్రీరామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'ఉండిపోరాదే ..' .. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే .. ' .. 'సామజ వర గమన' .. 'నీలి నీలి ఆకాశం .. ' వంటి పాటలు ఆయన స్థాయిని పెంచుతూ వచ్చాయి. సిద్ శ్రీరామ్ గాత్రంలో ప్రత్యేకత ఆయనకి యూత్ లో అభిమానుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. ఆయన పాడిన పాటలు పాప్యులర్ కావడం .. ఆ సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువ ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశాలుగా మారిపోయాయి.

కొత్తగా ఒక సినిమా వస్తుందంటే అందులో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఒక్కటైనా ఉందా అని చూస్తున్నారు. ఇంతలా క్రేజ్ పెరగడంతో, ఆయన తన పారితోషికాన్ని పెంచడం విశేషం. ఒక్కో పాటకి ఆయన 5 లక్షలను తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా సింగర్స్ పారితోషికాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు తక్కువ. తమకి ఇచ్చే తక్కువ మొత్తం కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయని కొంతమంది సింగర్స్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సిద్ శ్రీరామ్ పారితోషికాన్ని డిమాండ్ స్థాయికి వెళ్లడం నిజంగా విశేషమే.


More Telugu News