దాడిపై 21న విచారణకు హాజరుకండి: బోండా ఉమ, బుద్ధా వెంకన్నలకు మరోసారి నోటీసులు
- మాచర్ల దాడి ఘటనపై విచారణ
- ఇటీవల హాజరుకాని టీడీపీ నేతలు
- ఆధారాలతో రావాలని మరోసారి డీఎస్పీ సూచన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్లలో ఇటీవల టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని ఇప్పటికే ఆ ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులు రాగా వారు వెళ్లలేదు. దీంతో వీరికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.
ఈ కేసులో విచారణకు ఈ నెల 21న రావాలని గురజాల డీఎస్పీ ఆదేశించారు. దాడి ఘటనపై ఆధారాలతో రావాలని ఆయన సూచించారు. కాగా, తమపై జరిగిన దాడి ఘటనలో అనామకులపై కేసులు పెట్టారని, దీనిపై విచారణకు రావాలని తమకు నోటీసులు ఇస్తున్నారని బోండా ఉమ ఇటీవలే మండిపడ్డారు. గుంటూరు పోలీసులపై తనకు నమ్మకం లేదని, తాము విచారణకు హాజరుకాబోమని ఆయన అన్నారు.