ప్రభాస్ గురించి అనుష్క చేసిన వ్యాఖ్యకు యాంకర్ సుమ షాక్.. చివర్లో హీరోయిన్ కన్నీరు.. వీడియో వైరల్
- ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క
- ప్రభాస్ గురించి అడిగిన సుమ
- నా కొడుకు అని చెప్పిన అనుష్క
- సుమకే పంచ్‌లు వేసిన హీరోయిన్
నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతోంది. ఇందులో భాగంగా ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను 'మల్లెమాల' విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంకి యాంకర్‌గా సుమ వ్యవహరిస్తోంది.
ఇందులో అనుష్క కన్నీరు పెట్టుకోవడం, ప్రభాస్ గురించి ఏదైనా చెప్పమంటే నా కొడుకు గురించా? అని అడగడం వంటి దృశ్యాలు ఉన్నాయి. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మొదట ప్రభాస్ ఫోటోను సుమ చూపించి, ఇతడి గురించి పాజిటివ్ పాయింట్ చెప్పండి అని అడిగింది.
ఈ సమయంలోనే అనుష్క 'నా కొడుకు గురించా?'అని అడిగింది. దీంతో సుమ షాక్ అయింది. 'మీ ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి కదా?' అని ప్రశ్నించింది. దీంతో 'నా కొడుకు కదండీ?' అంటూ అనుష్క మరోసారి పంచ్ వేసింది. దీంతో 'అమరేంద్ర బాహుబలి' గురించి చెప్పమంది సుమ.
'అమరేంద్ర బాహుబలి' క్వాలిటీసే కొడుకుకు వచ్చాయి కదా? అని అనుష్క సమాధానమిచ్చింది. ఈ ప్రోమో చివరలో అనుష్క కన్నీరు పెట్టుకోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఆమె ఎందుకు ఏడిచిందో తెలుసుకోవాలంటే ప్రోగ్రాం చూడాల్సిందే.